Home ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నీ చిరునామా ఎక్కడ

ఎక్సైజ్ శాఖ నీ చిరునామా ఎక్కడ

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి అక్టోబర్ 8

పర్మిట్ లేకున్నా..పబ్లిక్ గానా..!

  • వైన్ షాపుల వద్దే బహిరంగంగా మద్యం తాగుతున్న వైనం
  • పర్మిట్ లేకున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ
  • మద్యం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ..?
    ఒంటిమిట్ట: రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను టెండర్ల రూపంలో కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. అప్పటి నుంచి మద్యం ప్రియులకు వారికి నచ్చిన మద్యాన్ని తాగే స్వతంత్రం వచ్చింది. ఐతే…ప్రభుత్వం మద్యం దుకాణాలకు పర్మిట్ రూములకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మద్యం దుకాణదారులు వారి ఇష్టానుసారంగా మందు బాబులను మద్యం దుకాణం వద్దే మద్యాన్ని సేవించేందుకు సహకరిస్తున్నారు. దీని కారణంగా రోజు మద్యం దుకాణాల వద్ద మందు బాబులు ఘర్షణలు పడుతూ గాయాలపాలు అవుతున్నారు. గాయాల సంగతి దేవుడు ఎరుగు, మద్యం మత్తులో క్షణికావేశానా ప్రాణాలను తీస్తే ఎలా అని మండల ప్రజలు వాపోతున్నారు.
    మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు అనుమతి లేకుంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళా ఎక్సైజ్ శాఖ పోలీసులకు మద్యదుకాణాదారులు మామూళ్లు చెల్లించి పబ్బం గడుపుకుంటున్నారా అనే అనుమానాలు మండల ప్రజల్లో కలుగుతున్నాయి.
    ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అనుముతులకు విరుద్ధంగా మద్యం దుకాణాలను నడుపుతున్న యాజమాన్లలో ఎక్సైజ్ శాఖ పోలీసులంటే భయం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అలాంటి వారిపై ఎక్సైజ్ శాఖ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై మద్యం దుకాణదారుల వద్ద మామూళ్లు వసూలు చేశారంటూ వస్తున్న ఆరోపణలు ప్రజలు నిజమేనని అనుకుంటున్నారు.
    అలాంటి ఆరోపణలలో నిజం లేకుంటే ఇప్పటికైనా ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించిన మద్యం దుకాణదారులపై ఎక్సైజ్ శాఖ పోలీసులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
2,841 Views

You may also like

Leave a Comment