Home Uncategorized ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్.24 ప్రిన్స్ ప్రతినిధి అక్టోబరు 9:–

గడచిన 5/10/2025 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఇటీవల 7/10/2025 నాడు ఏర్పాటు చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు బహూకరణలో ముఖ్య అతిథిగా డాక్టర్ వైయస్ విమల రెడ్డి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ చైర్మన్ దీపక్ జాను స్టేట్ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుక్ తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషనర్ నెంబర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు జాతీయస్థాయిలో క్రైస్తవ విభాగంలో అనేక రంగాలలో ఉన్నతమైన సేవలను అందిస్తున్నటువంటి వారిని సత్కరిస్తూ దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గుడాల సుందర్రావును జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసి ఈ అవార్డును బహూకరించడం జరిగినది ఈయన గతంలో జిల్లాలో రెండుసార్లు కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మరియు జిల్లా ఉత్తమ రిసోర్స్ పర్సన్ అవార్డును అందుకొని స్వచ్ఛంద సంస్థల నుండి జిల్లా రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాలను అందుకొనిన విధానాన్ని బట్టి మరియు క్రైస్తవ్యం లో ఆధ్యాత్మికంగా సేవలందిస్తూ అనేకమందికి ఆర్ధిక అవసరాల సహాయ సహకారాలు అందిస్తూ అనేకమందికి ఆదర్శంగా ఉన్న విధానాన్ని బట్టి వారిని గుర్తించి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందించి సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో అనేక ప్రాంతముల నుండి వందలాదిమంది విశ్వాసులు అనేక ప్రాంతాల నుండి క్రైస్తవ నాయకులు రాష్ట్రాల జిల్లాల స్థాయి నుండి వేలాదిమందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమమును ఏ ఐ సి ఎఫ్ వ్యవస్థాపకులు గద్దపాటి విజయ రాజు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు వారి స్పందనలో వెనుకబడిన వారిని ముందు ఉంచడమే సంస్థ యొక్క ధ్యేయమని తెలిపారు ఈ సందర్భంగా గుడాల సుందర్ రావు పొందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును బట్టి పాస్టర్స్ జిల్లా నాయకులు డాక్టర్ ఇమ్మానుయేల్ మాస బిషప్ సిహెచ్ అబ్రహం శామ్యూల్ ఏ పి పి ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జె జాన్ సామ్యూల్ డి రాజు బాబు రీజనల్ చైర్మన్ రెవ షాలేము రాజాల వైస్ ప్రెసిడెంట్ సి హెచ్ అండ్ సెక్రెటరీ రెవ జి ప్రభాకర్ మండల కమిటీ పి ఎం పి ఎఫ్ నాయకులు స్థానిక మండల పాస్టర్స్ శుభాకాంక్షలు తెలిపిరి

2,818 Views

You may also like

Leave a Comment