

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్ 24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 9
ఏలేశ్వరం,
కాకినాడ జిల్లా ఏలేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు.అండర్ 14 మరియు 17 విభాగాలలో బాలురు, బాలికలకు ఈ ఆటల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలేశ్వరం మండల టిడిపి పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు,నగర పంచాయతీ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి హాజరయ్యారు.సుమారు 8 టీంలతో కలిసి నాయకులు చేతుల మీదుగా ఆటల పోటీలు ప్రారంభించారు.ఏలేశ్వరం గవర్నమెంట్ హై స్కూల్,తిరుమాలి జిల్లా పరిషత్ హై స్కూల్,లింగంపర్తి,పెద్దనాపల్లి,యర్రవరం గర్ల్స్ హై స్కూల్,ఏపిఆర్ డబ్ల్యూఎస్ స్కూల్స్ నుండి విద్యార్థిని విద్యార్థులు రెండు రోజులు కబడ్డీ,ఖోఖో,షటిల్,అద్లెంటిక్స్, యోగా,చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.పోటీలలో సెలెక్ట్ అయిన టీంలను డివిజన్ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, విద్యతో పాటు ఆటలు యందు విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని కోరారు.దీని ద్వారా ఆరోగ్యం,శరీర దృఢత్వం,మానసిక ఉల్లాసం కలిగి అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా మంచి విద్యార్థులగా తీర్చిదిద్దబడతారని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ,మండల విద్యాశాఖాధికారి అబ్బాయి,హైస్కూల్ చైర్మన్ కర్రోతు గాంధీ,కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు,పెండ్ర శ్రీను,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు జొన్నాడ వీరబాబు,షేక్ ఇమ్రాన్,పాఠశాల అధ్యాపకులు,పిఈటిలు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird