
రౌతులపూడి,
ప్రత్తిపాడు; వి ఆర్ ఎం మీడియా న్యూస్24
ప్రతినిధి: ప్రిన్స్
అక్టోబర్:10
మండలం ములగపూడి గ్రామంలో రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమనార సత్యనారాయణ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమనార సత్యనారాయణ మాట్లాడుతూ రౌతులపూడి శంకవరం ప్రధాన రహదారి నిర్మాణానికి రూ 3.50 కోట్ల రూపాయలతో 6.4 కిలోమీటర్ల రోడ్డు మంజూరైనట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా రౌతులపూడి-ఎస్. అగ్రహారం సుమారు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎమ్మెల్యే సత్యప్రభ నియోజవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇటంశెట్టి సూర్య భాస్కర్ రావు,సోమరౌతు మౌళి,సోమరౌతు రవి,గురునాథ్,పైల దానాజీ, చింతకాయల రాజు,పైల నాయుడు, పైల రామకృష్ణ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird