

… బ్రేకింగ్ న్యూస్……
*కడప చెన్నై జాతీయ రహదారి ఇరుకుగా ఉండడంతో ఈ ప్రమాదా లు సంభవిస్తున్నాయి అంటున్న ఒంటిమిట్ట ప్రజలు.
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 11
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట చెరువు కట్టమీద వెలసిన వీరాంజనేయ స్వామి గుడి దగ్గర శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది
మండల కేంద్రంలోని కడప చెన్నై జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. స్థానికుల వివరాల మేరకు.. కడప నుండి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు వీరాంజనేయ స్వామి గుడి వద్దకు రాగానే లారీని తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ యంగముని(62) చెయ్యి విరిగి రక్త గాయం అయింది. జాతీయ రహదారి ఒంటిమిట్ట వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గర హైవే విశాలంగా లేని కారణంగానే ప్రమాదాలు ఒంటిమిట్ట ప్రజలు అంటున్నారు.