

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 11:–
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో శనివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాల ఉత్సవాలలో భాగంగా లంపకలోవ సంఘ మండలానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించారు.ముందుగా ఆయుద పూజ చేసి,భరతమాత,డాక్టర్జీ,గురూజీ చిత్రపటాలకు పూజలు చేసి,సంఘ్ ద్వజానికి ప్రణామాలు,సంఘ ప్రార్థన చేశారు.తర్వాత వ్యాయామాలు చేసి,అనంతరం ముఖ్య వక్త,అతిథులుగా విచ్చేసిన లీలా శంకర్,యల్లపు సూర్యనారాయణ సంఘ్ ను ఉద్దేశించి ప్రసంగించారు.అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో పదసంచలనం(కవాతు)నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రముఖ్ జువ్విన వెంకటేశ్వరరావు,కర్రి ధర్మరాజు,రాసంశెట్టి రాజా,కందా వీరాస్వామి,రాసంశెట్టి సుబ్బారావు,రెడ్డి శేఖర్ సంఘ మండలానికి సంబంధించిన స్వయం సేవక్ లు పాల్గొన్నారు.