Home ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం పరిశుద్ధ మందిరంలో డైమండ్ జూబ్లీ మహోత్సవం

ఏలేశ్వరం పరిశుద్ధ మందిరంలో డైమండ్ జూబ్లీ మహోత్సవం

by VRM Media
0 comments

ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 11:–

ఏలేశ్వరం దిబ్బలపాలెం సాయినగర్లో దేవుని పరిశుద్ధ మందిరంలో 60వ డైమండ్ జూబ్లీ మహోత్సవాలను మందిర సంఘ కాపరి ఎస్ ఎలైజా ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి దైవ సేవకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఎలైజా మాట్లాడుతూ దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు దివంగత జాకబ్ జాన్ స్థాపించి ఇప్పటికీ 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ రోజుల్లో ఆయన తండ్రి జాకబ్ జాన్ కాలినడకన,సైకిల్ తొక్కుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలకు,సుదూర ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్ పిన్ని, ఎస్.ఎలీషా,జాన్ విల్సన్,ప్రవీణ్ పాల్,పాల్ ప్రసాద్,ప్రభాకర్,అస్మాండ్,వసంత ప్రసాదరావు,అలమండ ప్రసాద్, కోరాడ ప్రసాద్,వాస పిలుప్,ప్రజా ప్రతినిధులు,దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment