
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 12:–
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రత్తిపాడు నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మాజీ కేంద్ర సహాయ మంత్రి ఎంఎం పల్లంరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా ప్రత్తిపాడు సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం ఓటర్ల జాబితాలో నెలకొన్న అవకతవకలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఓటర్ జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో కోటి సంతకాలు సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ప్రత్తిపాడు, ధర్మవరం, గ్రామాలలో వ్యాపార సంస్థలు, జన సముదాయాల వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేపడుతూ సంతకాలు సేకరించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. ఫోటోతో స్పష్టమైన ఓటర్ జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలన్నారు. తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే సమస్యను తక్షణ పరిష్కారానికి ఫిర్యాదు వ్యవస్థ అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా మార్పులను నివారించాలని స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఓట్ల తొలగింపుగా పాల్పడిన అధికారులు ఏజెంట్ల పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతామని వివరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పిసిసి సభ్యులు ముళ్ళపూడి రాంబాబు, ధర్నాలకోట శ్రీను, ఎస్సీ సెల్ నాయకులు ఎం సూర్యప్రకాశ్రావు, ఎం చక్రరావు, కార్యక్రమంలో ధర్నాలకోట శ్రీను, ఎం.చక్రరావు,పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.