Home ఆంధ్రప్రదేశ్ చలో రంపచోడవరం కార్యక్రమానికి ఆదివాసులందరూ తరలిరండి.

చలో రంపచోడవరం కార్యక్రమానికి ఆదివాసులందరూ తరలిరండి.

by VRM Media
0 comments

దేవిపట్నం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్

ఈ నెల 13 వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు జరిగే ర్యాలీ మరియు ముట్టడి కార్యక్రమానికి ఆదివాసులందరూ తరలి రావాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్,అదివాసీ హక్కులు ఉద్యోగాల సాధన కమిటీ సలహాదారు తెల్లం శేఖర్ పిలుపునిచ్చారు.ఈ దేవీ పట్నం మండలం,ఆర్ అండ్ ఆర్ కాలనీ గొందూరు గ్రామంలో జరిగిన సమావేశానికి ఆదివాసీ హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ డివిజన్ ప్రెసిడెంట్ మడి మురళి దొర అధ్యక్షత వహించటం జరిగింది.ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ మూడు పునరుద్ధరించి మరో కొత్త జీవో ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగులకు100 శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని,తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం ప్రకటించాలని,ఆదివాసీ నిరుద్యోగులకు 2025 జనరల్ డిఎస్సి లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.కావున ఐటీడీఏ బైలా ప్రకారం తక్షణమే ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని,మరియు షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలైన 1/59,1/70 చట్టం,పెసా చట్టం, 2013 పోలవరం భూ సేకరణ చట్టం మొదలైన చట్టాలు పట్టిష్టంగా అమలు చేయాలని ఈనెల 13వ తేదీన రంపచోడవరం ఐటిడిఏ నందు ధర్నా మరియు ర్యాలీ కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుంది.కావున ఆదివాసులందరూ తప్పనిసరిగా వచ్చి ఆదివాసీల హక్కులు చట్టాలు పరిరక్షణ కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కులు ఉద్యోగాల సాధన కమిటీ మండల వైస్ చైర్మన్ చవలం విద్యాసాగర్ దొర,మిర్తివాడ సూరారెడ్డి,మిర్తివాడ సాయి కిరణ్ రెడ్డి,మడకం సూర్యకుమారి,శారపు నవీన్ కుమార్ దొర,మేదే శ్రీదేవి మొదలైన వారు పాల్గొన్నారు.

2,836 Views

You may also like

Leave a Comment