
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
తేదీ 12-10-2025న ఉదయం సుమారు 08:00 కు నమ్మదగిన సమాచారం మేరకు AP నుండి ఎటువంటి అనుమతి లేకుండా కల్లూరు ఇసుక లోడుతో వచ్చిన AP-39-TV-5107 అను నెంబర్ గల టిప్పర్ లారీ సీజ్ చేసి డ్రైవర్ అనగాని నాగబాబు తండ్రి పేరు వడ్డీ కాసులు వయస్సు 41 సంవత్సరాలు, కులం గౌడ, వృత్తి డ్రైవర్, నివాసం ఉయ్యూరు గ్రామం పెనమలూరు మండలం NTR జిల్లా AP మరియు ఓనర్ : పీట్ల సాంబయ్య తండ్రి పేరు నగేష్ వయసు 30, వృత్తి లారీ డ్రైవర్ కులం వడ్డెర ,నివాసం ఉయ్యూరు గ్రామం పెనమలూరు మండలం NTR జిల్లా AP, మధ్యవర్తి పేరు భోగినబోయిన నాగరాజు తండ్రి పెద్ద అక్కులయ్య వయసు 37 కులం యాదవ్ వృత్తి ట్రాక్టర్ డ్రైవర్ నివాసం చెన్నూరు గ్రామం కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా TS,.పర్మిషన్ తీసుకున్న AP లో అమ్మితే టన్నుకు కేవలం 600/-రూపాయలు మాత్రమే వస్తున్నాయని, ఆంధ్రాకి బార్డర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కల్లూరుకు తీసుకొని పొమ్మని, అచట అయితే టన్నుకి 1500-2000 రూ వస్తాయి కనుక కల్లూరుకు వచ్చినామని చెప్పగా, అనుమతిలేకుండా తెలంగాణ లోకి ప్రవేశించడం నేరము కాబట్టి అట్టి లారీ AP-39-TV-5107 ని ఇసుక సుమారు 30 టన్నులు తోసహా సీజ్ చేసినాము.