మేజర్ పంచాయతీ ఒంటిమిట్ట మండలం. ఒంటిమిట్ట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 78 నందు ఉన్న 510.14 ఎకరాల్లో కొండ ప్రాంతంలో ఉన్న 40ఎకరాల భూమిని కొంతమంది భూ బకాసురులు హిటాచీలు. జెసిపిలు ఉపయోగించి వారికి ఎవరు అడ్డు చెప్పేవారు లేక కొండలను సైతం పిండి చేసి వారి స్వలాభాలకు భూములుగా తయారుచేసి ముళ్ళ కంచెలను సైతం ఏర్పాటు చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుసుకున్న రెవెన్యూ అధికారి దామోదర్ రెడ్డివెంటనే స్పందించి ఒంటిమిట్ట మండలం గొల్లపల్లిలో భూ కబ్జాకు గురి అయిన కంచెలను తొలగించామని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.