Home ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నర్వకాటిపల్లి సచివాలయం నందు కీటకజనిత వ్యాధుల పై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నర్వకాటిపల్లి సచివాలయం నందు కీటకజనిత వ్యాధుల పై అవగాహన

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి అక్టోబర్ 15

ఒంటిమిట్ట మండలం నరవ కాటపల్లె సచివాలయం నందు గురించి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు మాట్లాడుతు దోమ పుట్టకూడదు, పుట్టిన దోమ మానవుని కుట్టకూడదు అని తెలియపరిచారు. ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియపరిచారు.Cho T. హవిలా గారు CPR గురించి ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. సూపర్వైజర్ G. భాస్కర్ రెడ్డి ఎంపీపీ స్కూల్ నందు చేతుల పరిశుభ్రత గురించి పిల్లలకు తెలియజేయడం జరిగినది.అలాగే మద్యాన్న భోజనం పథకాన్ని తనిఖీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త G. వనిత, ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.

2,821 Views

You may also like

Leave a Comment