Home ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ గా విశాఖపట్నం

దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ గా విశాఖపట్నం

by VRM Media
0 comments

సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే – సత్య ప్రభ

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 15:–

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతూ కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ నిరంతర కృషితో రాష్ట్రాన్ని సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో ముందుకు తీసుకెళ్లే దిశగా శ్రమిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను స్థాపించడం వంటి లక్ష్యాలతో వారు సుదీర్ఘ దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. వారి కృషి ఫలితంగా అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ విశాఖపట్నం కేంద్రంగా రూ. 1.31 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌గాక, భారతదేశానికి కూడా గర్వకారణమైన విషయం. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా రూపుదిద్దుకోనుంది.
అమెరికా తర్వాత విశాఖ ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ కేంద్రంగా ఎదగబోతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటానికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు… ఆయన దూరదృష్టి, నాయకత్వం వల్లే తెలంగాణలో హైదరాబాద్ నేడు ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అదే విధంగా, ఆయన నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నూతన సాంకేతిక విప్లవానికి ఆవాసంగా మారబోతోంది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అనేది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. అది రాష్ట్ర భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక అడుగు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితమవుతాయి అనే విషయం మనం గమనించాలి…
పెట్టుబడులు, సాంకేతికత, నైపుణ్యం రాష్ట్రంలో విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ కొత్త యుగాన్ని ఆరంభించబోతోంది.
రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు తమ దృష్టి, కృషి, నాయకత్వం అంకితం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి మా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

2,815 Views

You may also like

Leave a Comment