
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మండల పరిధిలోని చంద్రుపట్ల గ్రామపంచాయతీపరిధిలో ఉన్న చంద్రుపట్ల ZPHS స్కూల్ నందు పోషణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాల పిల్లలు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల కొరకు పిల్లలకు మంచి అలవాట్లు, ప్రీ స్కూలు కృత్యాలు,కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడం జరిగినది. బరువు తక్కువ పిల్లల్ని గుర్తించి లోప పోషణ లేకుండా ఎన్. ఆర్ .సి. కి రిఫర్ చేసి వైద్యుల పర్యవేక్షణతో బాలామృతం ప్లస్సు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని అందరూ ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ సుజాత అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird