

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో బుధవారం ఐకెపి, సొసైటీ లు ,డీసీఎంఎస్ ,మెప్మా, వారి ఆధ్వర్యంలో 35 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సమీక్ష సమావేశం జరిగింది .ఈ సందర్భంగా తహసిల్దార్ పులి సాంబశివుడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు దగ్గరలో అనుకూలంగా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తహసిల్దార్ పులి సాంబశివుడు తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని దళారుల పాలు కావద్దని ఆయన పేర్కొన్నారు. 15వ తేదీ బుధవారం ఆయా గ్రామాలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారునేరుగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని ఆయన రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గడ్డి లేకుండా చూసుకోవాలని తూర్పారబట్టిన ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తాసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నీరజాదేవి వ్యవసాయ శాఖ అధికారిని రూప, ఐకెపి ఎపిఎం అశోకరాణి తోపాటు ఐకెపి వివో ఏలు, బుక్ కీపర్లు,సీఈఓ లు, డి సి ఎం ఎస్ ,మెప్మా రిసోర్స్, లు వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.