
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 16
సిద్ధవటం మండలం జాతీయ తెలుగుధేశం పార్టి అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్ర తెలుగుధేశం పార్టి అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసులు గార్ల అదేశాల మేరకు,
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టి ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి అధ్యక్షతన 17.10.2025 వ తేదీ శుక్రవారం ఉదయం 09.00 గం’ల నుండి 12.00 గం.ల వరకు *గ్రామ కమిటీలు మరియు క్లస్టర్ కన్వినర్లను మరియు కొ-కన్వినర్లను, మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి మండలవారిగా సమావేశం జరుపుటకు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ భీమినేని చిట్టిబాబు గారు నిర్ణయించడమైనది.
మండలంలో వున్నటువంటి వివిధ రకాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల నాయకులు, క్లస్టర్ ఇంచార్జీ, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, మరియు సిద్ధవటం మండలంలో వున్నటువంటి తెలుగుదేశం పార్టి కుటుంబ సభ్యులు తప్పక హాజరు కావలసినదిగా తెలియజేయుచున్నాము.
వేదిక : ఎ.బి.చంద్రారెడ్డి కల్యాణ మండపం, ఎల్.ఐ.సి. ఆఫీస్ దగ్గర, రాజంపేట. గమనిక: సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ వారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా మరి మరి తెలుపుతున్నాము.
ఇట్లు మీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, రాజా నాయుడు, రాజశేఖర్ యాదవ్, చెంచయ్య నాయుడు