
ఇటు జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెహ్రు గారు.
అటు రంపచోడవరం నియోజకవర్గంఎమ్మెల్యే శిరీష దేవి గారు సర్పంచ్ లకు సెక్రటరీలకి ఆదేశాలు ఇవ్వండి.
కృష్ణునిపాలెం పునరావాస కాలనీ కి దికెవ్వరో అర్ధం కావట్లేదు.
VRM Media దుర్గా ప్రసాద్
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం
ఆంధ్రుల జీవనాడి గా పిలవబడే పోలవరం ఇరిగేషన్ ప్రాజక్ట్ లో గోదావరిని ఆనుకొని వున్నా ప్రధాన మండలం ఐనటువంటి దేవీపట్నం మండలంలో సుమారు 44గ్రామాల 15000వేల కుటుంబాలు ముంపునకు గురి కావటం తో 18గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనేతరులను సుమారు 4000వెలమందిని గోకవరం మండలంలో గల కృష్ణునిపాలెం పంచాయితీ లో రాజుపాలెం దగ్గర పునరావాసం కల్పించారు…
2020లో బ్యాక్ వాటర్ ద్వారా నిర్వశితులు స్వయంగా గ్రామాలను కాళీ చేసి అసంపూర్ణంగా వున్నా పునరావాస కాలనీల్లో వారికీ చేటాయించిన నివాసలకు చేరుకున్నారు అయితే నాటి వైసీపీ ప్రభుత్వం లో కాంట్రాక్టర్లు నామ మాత్రంగా 26కాలమ్స్ వున్నా ఆర్డర్ ప్రకారం నిర్మించకుండా 14లేదా 15 కాలమ్స్ లో నిర్మించి చేతులు దులుపుకున్నారు…నాటి ప్రభుత్వం లో ఎంపీ నిధుల నుంచి సత్యసాయి త్రాగున్నీరుని త్యాంక్ నిర్మించారు కానీ ఒకరోజు వస్తే 10రోజులు ఎదురు చేసిడాల్సిన పరిస్థితి…
విషయం:- గత వైసీపీ ప్రభుత్వం లో పంచాయితీ నిధులను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే 2020నుంచి 2024ఎన్నికల వరకు మనం ఎక్కడ చుసిన ఏ పంచాయితీ వెతికిన పారిశుధ్యం ఎక్కడ కనిపించలేదు అడిగితే నిధులు లేవు అనే సాకు అడిగినావాళ్లాపై కేసులు పెడతారానే భయం…ఎన్నికిల తర్వాత నూతనంగా ఏర్పడ్డ NDA కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతటా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి పంచాయితీ పరిస్థితులు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు పార్టీ చూడకుండా రాష్ట్రం అంతటా వున్నా సర్పంచులకు నిధులు విడుదల చేయటం జరిగింది కానీ కృష్ణునిపాలెం పునరావాస కాలనిలో గల ఆరు పంచాయతీ గిరిజనేతరులకు అధికారం వచ్చిన గడిచిన కాలంలో ఒక్కరోజు కూడా శానిటైజేషన్ కానీ పారిశుధ్యం కానీ,బీచింగ్ చల్లటం కానీ జరగలేదు.
ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వలన దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.విషజ్వరాలు వ్యపిస్తున్నాయి కాలనీలో వున్నా వాటర్ ట్యాంక్ లను సుభ్రపరిచి రెండు మూడు సంవత్సరాలు కావస్తుంది దయచేసి కాలనీ ని పట్టించుకోండి.బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి సబ్ హెల్త్ సెంటర్ ని చూపించారు కానీ భవనం ఎక్కడ కనిపించట్లేదు.స్టాఫ్ ని నియమించలేదు పరిస్థితి ఎలా వుంది అంటే ఆరోగ్య రిత్యా అర్ధ రాత్రి అప రాత్రి అవ్వండి అపరాత్రి అవ్వనివ్వండి గోకవరం వెల్లవలసిన అవసరం వస్తుంది అలా అని హాస్పటల్ కు వెళ్ళటానికి వాహనాలు లేక అంబులెన్సు లు సమయానికి రాకపోవటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు.దయచేసి ఒక్కసారి కాలనీ ని విజిట్ చేసి మౌలిక సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.
*చారపు వెంకటరాయుడు దేవీపట్నం మండలం జనసేనపార్టీ అధ్యక్షుడు.