Home ఆంధ్రప్రదేశ్ దోమల పట్ల నిర్లక్ష్యం తగదుమలేరియా సబ్ యూనిట్ అధికారిఇండ్ల సుబ్బరాయుడు

దోమల పట్ల నిర్లక్ష్యం తగదుమలేరియా సబ్ యూనిట్ అధికారిఇండ్ల సుబ్బరాయుడు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్17

సిద్ధవటం మండలం దోమల నియంత్రణ కొరకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పి కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ రంగ లక్ష్మి ఆధ్వర్యంలో సిద్ధవటం మండలంలోని సంటి గారి పల్లె గ్రామంలో శుక్రవారం దోమలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ దోమలు కొట్టడం వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని రాత్రి వేళలో ప్రతి ఒక్కరూ దోమలు కుట్టకుండా దుస్తులు ధరించి ఉండాలని గృహాల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని వర్షాలు కారణంగా పరిసరాల అపరిశుభ్రత వల్ల విరోచనాలు, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చేతుల శుభ్రత వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల అనారోగ్యాల సమస్యల నుండి ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ, లక్ష్మీ నరసమ్మ, సూపర్వైజర్, మౌలాలి, హెల్త్ అసిస్టెంట్, జి వెంకటసుబ్బయ్య, ఆరోగ్య కార్యకర్తలు ఆదిలక్ష్మి, కృష్ణమ్మ, అంగన్వాడి వర్కర్లు, ఆశ వర్కర్లు, 104 వైద్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

2,817 Views

You may also like

Leave a Comment