

— ఎం పి డి ఓ సుజాతమ్మ
VRM న్యూస్ బాల మౌలాలి
ఒంటిమిట్ట మండలం లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ లోని ఆదాయ వనరులను సమకూర్చుకొని పంచాయతీ లను అభివృద్ధి పరచుకోవాలని ఎం పి డి ఓ సుజాతమ్మ తెలిపారు. మండల కేంద్రం అయిన ఒంటిమిట్ట లోని ఎంపీడీవో కార్యాలయం సభా భవనంలో శుక్రవారం గ్రామపంచాయతీలలో సొంతగా వనరులను సమకూర్చుకునే అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో సుజాతమ్మ మాట్లాడుతూ గ్రామపంచాయతీలు ప్రభుత్వము ఇచ్చే స్కీముల మీద ఆధారపడకుండా గ్రామపంచాయతీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించుకొని వాటి బాడుగుల ద్వారా ఆదాయాన్ని పొందాలన్నారు. గ్రామపంచాయతీలో నూతనంగా ఏవైనా ఫ్యాక్టరీలు గాని, నివాస గృహాలు గాని నిర్మించుకోవాలంటే గ్రామపంచాయతీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు సకాలంలో ఇంటి పనులు చెల్లించాలన్నారు. ఎవరైనా ఎన్నారైలు ముందుకు వచ్చి గ్రామాలను దత్తత తీసుకోవచ్చు అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులను స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు అన్నారు. గ్రామాల్లో నివాస గృహిణిలు చెత్తా, చెదారాలను ఎక్కడబడితే అక్కడ పడేయకుండా తడి చెత్తను ,పొడి చెత్తను వేరు చేసి గ్రామంలోకి హరిత రాయబారుల వాహనం వచ్చినప్పుడు అందులో పడేయాలని తెలియజేశారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు, గ్రామ కార్యాదర్శులు, ఒంటిమిట్ట కార్యదర్శి సుధాకర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.