Home ఆంధ్రప్రదేశ్ సిరిపురం లో పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక

సిరిపురం లో పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక

by VRM Media
0 comments

ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్ 24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 27:–

ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో 1990.1995 సo.
. పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నంపేట గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఎల్లపు వీరభద్రరావు ( అబ్బులు)తనయుడు. ఎల్లపు సురేంద్ర రేణుక ఆర్థిక సహాయంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థిని విద్యార్థులు సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యి తమ చిన్ననాటి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు.. ఈరోజు తాము ఈ స్థాయికి వచ్చామంటే తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయుల కృషియని తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను గుర్రాల రథంపై మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో బాజా బజంత్రీలతో బాణాసంచా మరియు పూల వర్షాల మధ్య ఊరంతా ఊరేగిస్తూ పాఠశాలకు ఆహ్వానం పలికారు.
గురువులకు సన్మానం చేస్తూ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శాంతికి చిహ్నమైన పావురాలను ఎగరవేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు తీపి జ్ఞాపికను అందజేస్తూ కష్టంలో ఉన్న ప్రతి స్నేహితులకు ఆపదలో ఉన్న ఎవరికైనా తమ వంతు సహాయంగా కొంత సొమ్మును ప్రకటించి ప్రతి సంవత్సరం ఎవరో ఒక్కరికి సహాయం చేయాలనితీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాబుద్ధులను బోధించిన గురువులు ఎస్.జహరుద్దీన్ మాస్టర్ కి, ఎన్ తిరుపతిరావు మాస్టర్ కి
ఐ ఎల్ ఎం రాజు మాస్టర్ కి పూలమాలతో దుస్సాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా పాసిల తాతారావు, మేడిది సింహాచలం, పలివెల సూర్య కుమార్, తిబిరిశెట్టి శ్రీనివాస్, షేక్ బాను, కొట్టన శ్రీను మంగా దంపతులు మరియు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క సహాయ సహకారాలు అందించారు

2,816 Views

You may also like

Leave a Comment