

శ్రీశైలంVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 17
ఈనెల 16వ తారీఖున శ్రీశైల క్షేత్రానికి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంగా ఆలయ చైర్మన్ గా పోతు గుంట రమేష్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గార్లతో కలిసి వారికి స్వాగతం పలకడం జరిగింది అనంతరం వారు స్వామివారిలను అమ్మవార్లను ప్రత్యేక అభిషేకం కుంకుమార్చన వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అనంతరం వారు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీశైలం క్షేత్రం ఎంతో శోభాయమానంగా నరేంద్ర మోడీ గారికి ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా జ్యోతిర్లింగము శక్తిపీఠము ఒకే చోట ఉన్న క్షేత్రము మరియు నిత్యము చండీ హోమం జరిగే క్షేత్రము భూమండలానికి నాభి స్థానంలో ఉన్నటువంటి క్షేత్రము ఈ క్షేత్రానికి నరేంద్ర మోడీ రాకతో మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది రాబోయే రోజుల్లో మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెంది భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించబోతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు