Home వార్తలుఖమ్మం అడవి అధికారికి ఆహ్వానము సభ్యత్వం

అడవి అధికారికి ఆహ్వానము సభ్యత్వం

by VRM Media
0 comments

VrmMedia ఖమ్మం ప్రతినిధి
ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రం సింగ్ ఐఎఫ్ఎస్సి గారికి లాఫ్టర్ యోగ సొసైటీ లో సభ్యత్వాన్ని వారికి అందజేస్తూ, అర్బన్ ఫారెస్ట్ వెలుగుమట్ల జాతీయ లాప్టర్ యోగ శిక్షణ కేంద్రం ఖమ్మం లో నవంబర్ రెండవ తేదీన లాఫ్టర్ యోగ 2.0 ఆనంద యోగ విద్య ఉచిత శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేసినట్లుగా లాఫ్టర్ యోగ సొసైటీ జాతీయ చైర్మన్ మరియు తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ యోగవిద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మరికంటి వెంకట్ అడ్వకేట్ తెలియజేశారు ఈ కార్యక్రమం శిక్షణ అనంతరం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటుగా ఉచిత భోజన వసతి హెల్త్ చెకప్ మందుల పంపిణీ ఉంటుందని ,ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో లాప్టర్ యోగ మెడిటేషన్ , లాఫ్టర్ యోగ బ్రీతింగ్ టెక్నిక్స్, లాఫ్టర్ యోగ ఫిస్ట్ సామూహిక నవ్వుల యోగ విందు, ఆనందతాండవం ఇంకా అనేక లాఫ్టర్ యోగ సైన్స్ శిక్షణలు ఉంటాయని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఉచిత రిజిస్ట్రేషన్ కు ఈ చరవాణి నెంబర్ కు సమాచారం బలిసిందిగా తెలిపారు 9848518042.

2,819 Views

You may also like

Leave a Comment