 
VrmMedia ప్రతినిధి venkat ఖమ్మం




42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పిలుపునిచ్చిన తెలంగాణ సంపూర్ణ బంద్ కు విస్తృత స్థాయిలో మద్దతు లభించింది.
ఖమ్మం సహా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ, తెలంగాణ జాగృతి, బిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి రాజకీయ పార్టీలు మరియు వివిధ ప్రజా సంఘాలు చురుకుగా పాల్గొన్నాయి.
ఖమ్మం నగరంలో బంద్ కు మంచి స్పందన లభించగా, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బీసీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు, నిరసనలు నిర్వహించి 42% రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బానోత్ కిషన్ నాయక్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
👉 ఈ బంద్ పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
 
				 
	