Home ఎంటర్‌టెయిన్మెంట్ యాక్షన్‌ నుంచి లవ్‌ స్టోరీకి.. రూటు మార్చిన వరుణ్‌తేజ్‌! – VRM MEDIA

యాక్షన్‌ నుంచి లవ్‌ స్టోరీకి.. రూటు మార్చిన వరుణ్‌తేజ్‌! – VRM MEDIA

by VRM Media
0 comments
యాక్షన్‌ నుంచి లవ్‌ స్టోరీకి.. రూటు మార్చిన వరుణ్‌తేజ్‌!



ఇప్పటివరకు 14 సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్‌తేజ్‌కి పట్టుమని 5 హిట్‌లు కూడా లేవు. అందులోనూ ఈమధ్యకాలంలో గాండీవధారి అర్జున, ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా వంటి సినిమాలు ఘోర పరాజయాల్ని చవిచూశాయి. దీనితో సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు వరుణ్. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అందుకే కొత్తదనం ఉన్న సబ్జెక్ట్‌లనే ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ అనే డిఫరెంట్‌ మూవీ చేస్తున్నారు. యాక్షన్‌తోపాటు కామెడీ కూడా ఉంటే ఈ సినిమా డెఫినెట్‌గా వరుణ్‌కి మంచి సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ గెటప్‌ కూడా కొత్తగా కనిపిస్తోంది.

ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రం నవంబర్‌ చివరి వారంలో పూర్తవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు వరుణ్. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా గతంలోనే ఫైనల్‌ అయింది. ఏడాది తర్వాత ఈ సినిమా మళ్లీ లైన్‌లోకి తెచ్చారు. గత ఏడాది విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అనుకున్నప్పటికీ స్క్రిప్ట్‌ పక్కాగా రెడీ అవ్వకపోవడం, షెడ్యూల్స్ విషయంలో క్లారిటీ లేని కారణంగా కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ క్లారిటీ రావడంతో డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఈమధ్యకాలంలో వరుణ్‌ చేయని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

విభిన్నమైన ప్రేమకథతో రూపొందించబడిన ఈ సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుందని, అలాగే సినిమాలో ఆడియన్స్‌ని భావోద్వేగానికి గురిచేసే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సినిమా రెగ్యులర్‌ లవ్‌స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చెయ్యబోతున్నారని సమాచారం. ఈ సినిమా తప్పకుండా వరుణ్ని మళ్ళీ హిట్ ట్రాక్‌లోకి తెస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్. ఈ ప్రేమకథకు అనువైన హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. అలాగే మిగిలిన నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తున్నారు.

2,810 Views

You may also like

Leave a Comment