Home ఎంటర్‌టెయిన్మెంట్ అఖండ-2 అప్డేట్.. 20 నిమిషాలు బాలయ్య తాండవం! – VRM MEDIA

అఖండ-2 అప్డేట్.. 20 నిమిషాలు బాలయ్య తాండవం! – VRM MEDIA

by VRM Media
0 comments
అఖండ-2 అప్డేట్.. 20 నిమిషాలు బాలయ్య తాండవం!



నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ-2’. బాలయ్య-బోయపాటి కాంబోతో పాటు, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘అఖండ’కి సీక్వెల్ కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (అఖండ 2 తాండవం)

బాలయ్య-బోయపాటి కాంబో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అఖండ’లో యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ‘అఖండ-2’లో అంతకుమించిన యాక్షన్ ఉండబోతుందట. ముఖ్యంగా 20 నిమిషాల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తాండవం చూడనున్నామని, ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు.

2,826 Views

You may also like

Leave a Comment