Home ఎంటర్‌టెయిన్మెంట్ ఆర్జీవీ, స్వప్నలపై కేసులు.. తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని డిమాండ్! – VRM MEDIA

ఆర్జీవీ, స్వప్నలపై కేసులు.. తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని డిమాండ్! – VRM MEDIA

by VRM Media
0 comments
ఆర్జీవీ, స్వప్నలపై కేసులు.. తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని డిమాండ్!



రామ్‌గోపాల్‌వర్మ వివాదాలు కొత్తకాదు, పోలీస్ కేసులూ కొత్త కాదు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు వర్మ. స్వప్న వ్యాఖ్యాతగా చేసిన ఒక కార్యక్రమంలో హిందూ దేవుళ్ళపై రామ్‌గోపాల్‌వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేసి పురాణ ఇతిహాసాలను అవహేళన చేశారంటూ రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ వీరిద్దరిపై రాజమండ్రి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును స్వీకరించిన పోలీసులు ఆర్జీవీ, స్వప్నలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇంటర్వ్యూలో యాంకర్‌ స్వప్న ఉద్దేశపూర్వకంగానే వివాదస్పద ప్రశ్నలు అడిగారని, దానికి కావాలంటే ఆర్జీవీ విద్వేషపూరిత సమాధానాలు ఇచ్చారని శ్రీనివాస్‌ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇలాంటి మృగాలను అడవిలోనే ఉంచాలని, తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి వారిని బహిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని అన్నారు. రామ్‌గోపాల్‌వర్మపై, అతనిపై సపోర్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్‌ని ఆదేశించారు.

2,835 Views

You may also like

Leave a Comment