Home ఎంటర్‌టెయిన్మెంట్ థామా మూవీ రివ్యూ – VRM MEDIA

థామా మూవీ రివ్యూ – VRM MEDIA

by VRM Media
0 comments
థామా మూవీ రివ్యూ



సినిమా పేరు: థామ
తారాగణం: ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, పరేష్ రావెల్, నవాజుద్దిన్ సిద్దిఖీ, సత్యరాజ్, ఫైజల్ మాలిక్, వరుణ్ ధావన్ నిర్వహించారు.
సంగీతం: సచిన్- జిగార్
ఎడిటర్:హేమంతి సర్కార్
దర్శకత్వం:ఆదిత్య సర్పోత్దార్
సినిమాటోగ్రాఫర్: సౌరభ్ గోసామి
బ్యానర్: మాడాక్ ఫిలిమ్స్
నిర్మాతలు: దినేష్ విజయన్, అమర్ కౌశిక్
విడుదల తేదీ: అక్టోబర్ 21 ,2025



యానిమల్, పుష్ప 2 ,చావా వంటి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ ‘రష్మిక'(రష్మిక)బాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయుష్మాన్ ఖురానా(ayushmaan khurrana)తో కలిసి ‘థామ'(తమ్మ)తో ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. రొమాంటిక్ కామెడీ హర్రర్ గా ప్రదర్శించడం , ప్రచార చిత్రాలతో మంచి హైప్ రావడంతో సినిమా ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

గ్రీకు సామ్రాజ్య స్థాపకుడైన ‘అలెగ్జాండర్’ భారతదేశాన్ని కొంత మేర ఆక్రమించుకున్న రోజుల్లో ఇండియాలోని ఒక అడవిలో వెళ్తుంటే ‘భేతాళ’ జాతికి చెందిన యక్షసున్(నవాజుద్దికి సిద్దిఖీ) అలెగ్జాండర్ ని చంపి రక్తం తాగుతాడు. ఆ తర్వాత బేతాళ జాతి ‘థామ’ రాక కోసం యక్షసున్ ని బంధిస్తుంది. ఆజాద్ అనే టీవీ ఛానల్ లో అలోక్(ఆయుష్మాన్ ఖురానా) రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. బేతాళులు ఉన్న అడవిలోకి షూట్ కోసం వెళ్లి ఆపదలో చిక్కుకుంటాడు. దీనితో బేతాళ జాతికి చెందిన తాడకా(రష్మిక) అలోక్ ని రక్షిస్తుంది. ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడటంతో అలోక్ తో పాటు ఇంటికి వెళ్తుంది. అలోక్ కి తాడక మాములు మనిషి కాదని కొన్ని యుగాల నుంచి ఈ భూమి మీద ఉందనే నిజం తెలుస్తుంది. అయినా సరే తనని ప్రేమిస్తాడు. బేతాళుల నుంచి తాడకా కి పిలుపు వస్తుంది. ఒక యాక్సిడెంట్ లో అలోక్ చనిపోతాడు. ఈ విషయం తెలిసి ‘తాడక’ తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు బేతాళులు ఎవరు? ఎప్పట్నుంచి ఈ భూమిమీద ఉన్నారు? వాళ్ళ లక్షణాలు ఏంటి? యక్షసున్ ని బంధించడానికి కారణం ఏంటి?అలెగ్జాండర్ ని చంపడం వెనుక బేతాళుల జీవిత లక్ష్యం వెనుక ఉన్న కథకి ఏమైనా కారణం ఉందా? అలోక్ నిజంగానే చనిపోయాడా? ఒక వేళ బతికే ఉంటే ఎలా ఉన్నాడు? అసలు థామ ఎవరు అనేదే చిత్ర కథ

ఎనాలసిస్
బాలీవుడ్ కి ‘థామా’లాంటి సబ్జెక్టు ముమ్మాటికీ కొత్త కథే. కానీ ఫ్యామిలీ సినిమాలని, లవ్ సినిమాల్ని ఎస్టాబ్లిష్ చేసే టైప్ లో సీన్స్ వచ్చాయి. టేకింగ్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ప్రారంభంలో వచ్చిన ‘అలెగ్జాండర్’ ని రక్తం తాగి చంపే సీన్ తో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్ ని ఊహించుకుంటాం. మొదటి అరగంట అందుకు తగ్గట్టే సన్నివేశాలు రావడంతో పాటు, తాడక ని అలోక్ ఇంటికి తీసుకురావడంతో ఎంటర్ టైన్ మెంట్ ని ఒక రేంజ్ లో ఊహించుకుంటాం. కానీ సన్నివేశాలని సృషించకుండా ఒకే పాయింట్ పై నడిపారు. తాడక ని అలోక్ తను పని చేసే ఛానల్ కి తీసుకెళ్లి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించవచ్చు. కానీ ఆ దిశగా చేయలేకపోయారు. కాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ని కలిగించడంలో సక్సెస్ అయ్యారు. తాడకా, అలోక్ మధ్య వచ్చిన లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. తాడక గురించి నిజం తెలిసినప్పుడు అలోక్టం భయపడాల్సింది. ఆ తర్వాత తన హృదయం తన మాట వినడం లేదని ప్రేమించాల్సింది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ తాడకా క్యారక్టర్ నే ప్రధాన హైలెట్ గా నిలిచాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో అనూహ్యంగా అలోక్ కి ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. అలోక్, బేదీయ అనే బేతాళుడు మధ్య వచ్చిన సన్నివేశాలతో పాటు బేతాళుల పుట్టుకకి గల కారణాన్ని వివరించే సన్నివేశం బాగుంది. అలోక్ కి, తండ్రికి మధ్య వచ్చిన సీన్స్ హార్ట్ టచింగ్ ని కలిగించాయి.సైక్రియాసిస్ట్ ఎల్విస్ సీన్స్ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. కథ కి ముగింపు ఇవ్వకుండా సీన్స్ పూర్తి బేతాళుల మధ్య పోరాటంతో నడపడం వల్ల ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
ప్రేమ, కోపం, త్యాగం, మంచితనం, ధీరత్వం ఇలా పలు పార్శ్యాలు ఉన్న తాడకా క్యారక్టర్ లో రష్మిక మరో మారు బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది. తన సినీ దీక్షనరీలో ‘థామ’ మరో మంచి మెమొరబుల్ మూవీగా నిలిచిపోవచ్చు. అలోక్ గా ఆయుష్మాన్ ఖురానా బాగానే చేసిన వ్యక్తి క్యారక్టర్ తనకి సూటవ్వలేదని చెప్పవచ్చు. పెద్ద వయసు క్యారక్టర్ లా అనిపించాడు. అలోక్ క్యారక్టర్ లో ఉన్న విభిన్న షేడ్స్ దృష్ట్యా యంగ్ లుక్ ఉన్న హీరో ఉంటే బెటర్ గా ఉండేది. మిగిలిన పాత్రల్లో చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ, సత్యరాజ్ నటనలో పెద్దగా మెరుపులు లేవు. ఆయుష్మాన్ ఖురానా కి ఫాదర్ క్యారక్టర్ లో చేసిన లెజండ్రీ యాక్టర్ పరేష్ రావెల్ మాత్రం సూపర్ గా చేసాడు. ఆదిత్య సర్పోత్దార్(Aditya Sarpotdar)దర్శకత్వం బాగున్నా, సెకండ్ హాఫ్ కోసం కథనాన్నీ సాగతీసాడు. సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలెట్. ఫోటోగ్రఫీ కట్టి పడేసింది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే కథ కొత్తదే అయినా సిల్వర్ స్క్రీన్ పై దాన్ని ప్రదర్శించే విధానంలో కొంచం తడబడ్డారు. రష్మిక పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్.


రేటింగ్ 2 .25/5 అరుణాచలం

2,810 Views

You may also like

Leave a Comment