Home ఎంటర్‌టెయిన్మెంట్ రష్మిక చేతుల్లో కాంతార భవిష్యత్తు.. భారీ నష్టం తప్పదా..? – VRM MEDIA

రష్మిక చేతుల్లో కాంతార భవిష్యత్తు.. భారీ నష్టం తప్పదా..? – VRM MEDIA

by VRM Media
0 comments
రష్మిక చేతుల్లో కాంతార భవిష్యత్తు.. భారీ నష్టం తప్పదా..?



ఒక్కోసారి కొన్ని సినిమాల రిజల్ట్ ఇతర చిత్రాలపైనో లేదా ఆ సినిమాలతో సంబంధం లేని స్టార్స్ పైనో ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ భవిష్యత్తు కూడా రష్మిక మందన్న చేతుల్లో ఉందన్న ఆసక్తికర చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది. (రష్మిక మందన్న)

నిజానికి కన్నడ భామ రష్మికపై కన్నడ ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. దానికి కారణం.. ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ టైంలో ఎందరో స్టార్స్ విష్ చేస్తే.. రష్మిక మాత్రం విష్ చేయలేదు. దాంతో ఆమెపై కన్నడ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆమె చేతుల్లోనే ‘కాంతార చాప్టర్ 1’ భవిష్యత్ ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది. (కాంతారావు అధ్యాయం 1)

దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అందులో కన్నడ గ్రాస్ రూ.200 కోట్లు అయితే.. దానికి మించేలా హిందీ గ్రాస్ రూ.200 కోట్లకు పైగా వచ్చింది. మూడో వారంలోనూ హిందీ గడ్డ మీద ‘కాంతార’ బాగానే రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో రష్మిక రూపంలో ‘కాంతార’ జోరుకి బ్రేకులు పడే అవకాశం వచ్చింది.

రష్మిక ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రం ‘థామా’ నేడు(అక్టోబర్ 21) థియేటర్లలో అడుగుపెట్టింది. మ్యాడాక్‌ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి ‘స్త్రీ-2’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘థామా’పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తర్వాత ఈ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 30 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. (తమ్మ సినిమా)

‘థామ’ సినిమా ఇదే జోరు కొనసాగిస్తే.. ‘కాంతార చాప్టర్ 1’ హిందీ రన్ ఇక ముగిసినట్లే. అసలు ఇప్పుడు ‘థామ’ విడుదల కాకపోయినా పాజిటివ్ టాక్ రాకపోయినా.. హిందీలో ‘కాంతార’ మరో రూ.30 కోట్ల దాకా రాబట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రష్మిక సినిమా దెబ్బకు హిందీలో కాంతారకు భారీగానే నష్టం జరుగుతోందని అంటున్నారు.

2,811 Views

You may also like

Leave a Comment