
అమెరికాలో సత్తా చాటిన తెలుగుతేజం
కల్లూరు అక్టోబర్10
ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభజ్ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు కుమారుడు డాక్టర్ పసుమర్తి సందీప్ తన ప్రతిభ తో అమెరికా లో సత్తా చాటాడు. అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్నారు.
అమెరికాలోనే ఎడ్జ్ పత్రిక నిర్వహించిన 15వ వార్షిక అమెరికా టాప్ యంగ్ డెంటిస్ట్ – 2025 లో 40వ స్థానం సంపాదించి అవార్డుకు ఎంపిక కావడం జరిగింది.డాక్టర్ పసుమర్తి సందీప్ విజయవాడలోని “ఎన్టీఆర్” యూనివర్సిటీ అండ్ హెల్త్ సైన్సెన్స్ నుండి బిడిఎస్ డిగ్రీ పొంది అమెరికాలోని నోవా సౌత్ ఈస్ట్రాన్ యూనివర్సిటీ నందు పై చదువు పూర్తి చేసుకుని వర్జీనియా రాష్ట్రంలోని డాన్ విల్లె లో దంత వైద్యులుగా పనిచేయుచున్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించాలని డాన్ విల్లె ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లకు, అంగవైకల్యం కలిగిన వారికి పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి వైద్య సహాయం అందించినందుకు, దంత పరిశోధనకు క్రియాశీలక సహాయ సహకారాలు అందించినందుకు, అనేక పబ్లికేషన్స్ రచనలకు, అంతర్జాతీయ ఇంప్లాంటాలజిస్ట్ కళాశాల సభ్యుడిగా ఉన్నందుకుగాను ఈ అవార్డు ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ పసుమర్తి సందీప్ మాట్లాడుతూ నాకు స్ఫూర్తి ప్రదాతలు మా తల్లిదండ్రులే. నా మీద నమ్మకంతో విదేశీ విద్యకు పంపి నేను ఇంతటి విజయాలను సాధించుటకు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే అందుకు కారణం. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం వేరువేరు దేశాలను సందర్శిస్తూ, అక్కడ ప్రజలకు వైద్య సేవలందిస్తానని తెలిపారు.సందీప్ ని కుటుంబ సభ్యులు,బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులు కల్లూరు గ్రామస్తులు అభినందించారు.