Vrm Media ప్రతినిధి ఖమ్మం

రౌడీ షీటర్ వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
రఘునాథపాలెం(M) వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) పత్తి తీసేందుకు సమీప అమ్మపాలెం గ్రామానికి వెళ్లింది.
అక్కడ ధరావత్ వినయ్ అనే వ్యక్తి సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించాడు.
ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు.
మనస్తాపం చెందిన బాధితురాలు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird