Vrm media

హైదరాబాద్:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ నెల 25వ తేదీ నుండి “జనం బాట” పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 4 నెలలపాటు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కొనసాగనుంది.
ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉండి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిని, మహిళలు, యువత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా పరిశీలిస్తామని ఆమె తెలిపారు.
“జనం బాట” ద్వారా ప్రజల స్వరాన్ని వినడం, అభిప్రాయాలను సేకరించడం, మరియు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యమని జాగృతి నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు, యువత, మహిళా సంఘాలు, సామాజిక సేవా సంస్థలు విస్తృత మద్దతు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.