

మెగాస్టార్ ‘చిరంజీవి'(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు'(Mana shankara Vara Prasad Garu)ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన’ మీసాల పిల్ల'(మీసాల పిల్ల)సాంగ్ విశేష ఆదరణ పొందుతుంది. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)అయితే చిరంజీవి కెరీర్ లోనే మర్చిపోలేని మూవీగా నిలిచిపోవాలనే పట్టుదలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
మన శంకరవరప్రసాద్ గారు లో విక్టరీ వెంకటేష్(venkatesh)కనిపించబోతున్నాడన్న వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పుడు ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించడమే కాకుండా వెంకటేష్ సెట్స్ లో జాయిన్ అయినట్టు పోస్టర్ తో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు. చిరంజీవి కూడా ఈ వీడియోని ‘వెల్ కమ్ మై డియర్ ఫ్రెండ్, విక్టరీ వెంకీ మామ తో మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ’ అనే క్యాప్షన్ తో ఎక్స్ వేదికగా షేర్ చేసాడు. సుమారు 37 సెకన్ల నిడివి ఉన్న వ్యక్తి వీడియోలో చిరంజీవి, వెంకటేష్ గతంలో చేసిన సినిమాల్లోని స్టైల్స్ ఆకర్షిణీయంగా ఉండటంతో పాటు వెల్ కమ్ మై బ్రదర్ వెంకీ అని చిరంజీవి వాయిస్ రావడం తెలుసా, మై బాస్ అని వెంకటేష్ అన్నాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి, వెంకటేష్ మధ్య మూడు దశాబ్దాల నుంచే మంచి అనుబంధం ఉంది. ఈ పరిశీలన చాలా వేదికలపై ఇరువురు బహిరంగంగానే వెల్లడి చేసారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేయడంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం పక్కా అనే మాటలు అభిమానులతో పాటు పరిశ్రమల్లో వినిపిస్తున్నాయి.
