Home ఆంధ్రప్రదేశ్ గుడ్ టచ్,బ్యాడ్ టచ్ పై బాల బాలికలకి అవగాహన కల్పించిన ఎస్సై లక్ష్మీకాంతం

గుడ్ టచ్,బ్యాడ్ టచ్ పై బాల బాలికలకి అవగాహన కల్పించిన ఎస్సై లక్ష్మీకాంతం

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 24:–

గుడ్ టచ్,బ్యాడ్ టచ్ పై విద్యార్థినీ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం అన్నారు.గురువారం ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పలు అంశాలపై ఎస్సై లక్ష్మీకాంతం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో పరిచయాలు,ఆన్లైన్ వేధింపులు,ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక,శారీరక,మానసికంగా ఇబ్బందులు,మహిళలపై జరుగుతున్న నేరాలు,ఈవ్ టీజింగ్ మరియు పలు చట్టాలపై కూడా విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థినీ విద్యార్థులంతా నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి తమ తల్లిదండ్రులు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపారు.ఫోక్సో కేసు,
ఈవ్ టీజింగ్,రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పిల్లల భద్రతపై తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment