Home ఎంటర్‌టెయిన్మెంట్ ‘స్పిరిట్’ సీక్రెట్… ప్రభాస్‌కి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందట! – VRM MEDIA

‘స్పిరిట్’ సీక్రెట్… ప్రభాస్‌కి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందట! – VRM MEDIA

by VRM Media
0 comments
'స్పిరిట్' సీక్రెట్... ప్రభాస్‌కి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందట!



ప్రభాస్‌ లాస్ట్‌ మూవీ కల్కి 2898ఎడి రిలీజ్‌ అయి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. వాటిలో రాజాసాబ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. మరో పక్క ఫౌజీ షూటింగ్. ఈ రెండు సినిమాలను పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టీ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ప్రభాస్‌ చేయబోతున్న ‘స్పిరిట్‌’పైనే ఉంది. ఎందుకంటే ప్రభాస్‌, సందీప్‌రెడ్డి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్‌లు ఉండటం సహజం. ఇప్పటివరకు సందీప్‌ చేసిన అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ సినిమాలు ఎంతటి ప్రభంజనం సృష్టించాయో మనకు తెలుసు. అతని సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌, యాక్షన్‌ సీన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ అన్నీ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. ప్రభాస్‌ కాంబినేషన్‌లో సందీప్‌ చేస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రం అంతకు మించిన స్థాయిలో ఉంటుందనే అంచనా కూడా ఉంది.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాత్రి 11 గంటలకు స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో విజువల్స్‌తో కాకుండా కేవలం ఆడియోతోనే రూపొందించారు. ఇండియన్‌ సినిమాలో ఇదో కొత్త ప్రయోగంగా చెప్పొచ్చు. సినిమాలోని కొన్ని పాత్రలు చెప్పే డైలాగులు, సౌండ్‌ ఎఫెక్ట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రమే వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ ప్రారంభంలో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉన్న ప్రభాస్‌ అరెస్ట్‌ అయి జైలుకు వస్తాడని ఆ డైలాగుల ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘వీడి గురించి విన్నాను, యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు… చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో. వీణ్ణి బట్టలూడదీసి మెడికల్‌ టెస్ట్‌కి పంపించండి’ అంటాడు. దానికి ప్రభాస్‌.. ‘మిస్టర్‌ సూపరింటెండెంట్‌… నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ ముగిస్తాడు. అయితే ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ డైలాగ్‌తో ప్రభాస్ క్యారెక్టర్‌ని ఏ రేంజ్‌లో డిజైన్ చేసారో అర్థమవుతుంది. సాధారణంగా సందీప్‌ సినిమాల్లో ఉండే హీరోకి గుండె ధైర్యం, నిర్లక్ష్యం, ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే ఇతర లక్షణాలు ప్రభాస్‌లోనూ కనిపించబోతున్నాయనేది ఈ సౌండ్ వీడియో ద్వారా.

ప్రభాస్‌ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. భద్రకాళి పిక్చర్స్‌, టి సిరీస్‌ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని సందీప్‌ కోరుతోంది. సినిమా పూర్తి చేయడంలో సందీప్ స్పీడ్ అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయిస్తాడట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి సినిమా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ ఆడియో గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అందులోనూ సందీప్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే మామూలుగా ఉండదు అనే విషయం వారికి తెలుసు. ఈ వీడియోలోనే నటీనటుల వివరాలను కూడా తెలియజేశారు. ప్రభాస్‌తో పాటు సీనియర్‌ నటి కాంచన, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌, త్రిప్తి దిమ్రీ, ప్రకాశ్‌ రాజ్‌ వంటి ప్రముఖ నటీనటులు సినిమాలో కనిపిస్తారు. సాధారణంగా సినిమా తర్వాత సౌండ్‌ ఎఫెక్ట్స్‌, రీరికార్డింగ్‌ ఏర్పాటు చేస్తారు. కానీ, సందీప్‌ రెడ్డి దానికి భిన్నంగా ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ 70 శాతం పూర్తి చేశారట. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి తగ్గట్టుగానే సీన్స్ చేయబోతున్నట్లుగా ఉన్నట్లు.

2,806 Views

You may also like

Leave a Comment