Home వార్తలుఖమ్మం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన కార్యవర్గాన్ని ఈరోజు హైదరాబాద్‌లో ప్రకటించారు.

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన కార్యవర్గాన్ని ఈరోజు హైదరాబాద్‌లో ప్రకటించారు.

by VRM Media
0 comments

హైదరాబాద్, అక్టోబర్ 24, 2025:
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాన్ని ఈరోజు హైదరాబాద్‌లో ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన బాధ్యులు సంస్థ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం అంకితభావంతో మరియు సేవా దృక్పథంతో పనిచేయాలని ఆమె సూచించారు.

నూతన నియామకాలు 2025 అక్టోబర్ 24వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని శ్రీమతి కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వాసి కిషన్ నాయక్ ని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఎస్టీ వింగ్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.

కల్వకుంట్ల కవిత కొత్త బాధ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ కార్యకలాపాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

2,840 Views

You may also like

Leave a Comment