
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్25
సిద్దవటం మండలం పరిధిలోని మాధవరం1 గ్రామ పంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మగ్గం గుంతల్లో నీరు చేరిపోవడంతో స్థానిక నేసే పద్మశాలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
వర్షపు నీటితో మగ్గం గుంతలు నిండిపోవడంతో నేసే పనులు నిలిచిపోయి, రోజువారీ ఆదాయం లేకుండా పలువురు కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు తెలిపారు. పూట గడవక నేసే ఈ పద్మశాలి ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో
ఈ సమస్యను పార్టీ నాయకులు పరిశీలించి, పద్మశాలీల ఇబ్బందులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని ఈ సందర్బంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు తెలియజేసారు
ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, రాజా నాయుడు, చెంచయ్య నాయుడు, శ్రీనివాసులు, జింక శివ, రామకృష్ణ, టీడీపీ నాయకులు కార్యకర్తలు, చేనేత పద్మశాలి లు అందరు పరిశీలించి వివరించడం జరిగింది