Home ఎంటర్‌టెయిన్మెంట్ గట్టెక్కిస్తుందా మరి!.. రష్మిక పై మీ అభిప్రాయం ఏంటి – VRM MEDIA

గట్టెక్కిస్తుందా మరి!.. రష్మిక పై మీ అభిప్రాయం ఏంటి – VRM MEDIA

by VRM Media
0 comments
గట్టెక్కిస్తుందా మరి!.. రష్మిక పై మీ అభిప్రాయం ఏంటి



ఎనీ లాంగ్వేజ్ ని తీసుకున్న ఆ లాంగ్వేజ్ లో మూవీ ఘన విజయం సాధించడానికి హీరో నే ముఖ్యం. సినిమా ఫలితాల్లో తేడా వచ్చినా ఓపెనింగ్ కలెక్షన్స్ ని అయినా రాబట్టాలన్నా హీరో కట్ అవుట్ నే దిక్కు. హీరోయిన్ ని మెయిన్ కట్ అవుట్ గా చేసుకొని సినిమాలు నిర్మించడం చాలా తక్కువ. 90వ దశకంలో విజయశాంతి కొన్ని చిత్రాల ద్వారా సక్సెస్ అయ్యింది కానీ ఎక్కువగా కంటిన్యూ చేయలేకపోయింది.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(రక్ష్మిక మందన్నా)వచ్చే నెల నవంబర్ 7న తన కొత్త చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'(ది గర్ల్ ఫ్రెండ్)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేయగా సిల్వర్ స్క్రీన్ పై రష్మిక నే పూర్తిగా కనపడనుందనే విషయం అర్ధమవుతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ ఈ చిత్ర ప్రకటన రోజే చెప్పినా, ట్రైలర్ రిలీజ్ తో మరోసారి రష్మిక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మేకర్స్ ఈ భారీ వ్యయంతో ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల.

మేకర్స్ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి ముఖ్యకారణం రష్మిక నే. ఆమె ప్రస్తుతం థియేటర్స్‌లో ‘థామ'(తమ్మ)తో సందడి చేస్తుంది. ఈ చిత్రంలో రష్మిక నే ప్రధాన ఆకర్షణ కాగారిజల్ట్ విషయంలో మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కలెక్షన్లు కూడా పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో గర్ల్ ఫ్రెండ్ మూవీ కి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ఒక వేళ మిక్స్డ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఈ మేర వస్తాయనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మూవీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకమైతే అభిమానుల్లో ఉంది. చిత్ర బృందం కూడా అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి,ధీరాజ్ మొగిలినేని నిర్మాణం గర్ల్ ఫ్రెండ్ కి రాహుల్ రవీంద్రన్(రాహుల్ రవీంద్రన్)దర్శకుడు. పదమూడు సంవత్సరాల నుండి రాహుల్ రవీంద్రన్ మైండ్ లో ఈ చిత్ర కథ రన్ అవుతుంది. దీక్షిత్ శెట్టి(Dheekshith shetty)హీరో కాగా రష్మిక తండ్రి క్యారక్టర్ లో రావు రమేష్ కనిపిస్తున్నాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్(హేషమ్ అబ్దుల్ వహాబ్)మ్యూజిక్.

2,808 Views

You may also like

Leave a Comment