Home ఆంధ్రప్రదేశ్ రాజంపేట టీడీపీ ఇంచార్జి జగన్ మోహన్ రాజు సూచనలతో తుఫాన్ అప్రమత్తత చర్యలు

రాజంపేట టీడీపీ ఇంచార్జి జగన్ మోహన్ రాజు సూచనలతో తుఫాన్ అప్రమత్తత చర్యలు

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 26

రాజంపేట నియోజకవర్గం రాబోవు రెండు రోజులు కడప జిల్లా మొత్తం రెడ్‌జోన్‌ హెచ్చరిక జారీ చేయబడిన నేపథ్యంలో, రాజంపేట టీడీపీ ఇంచార్జి శ్రీ చామర్తి జగన్ మోహన్ రాజు గారు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సిద్దవటం మండలం పరిధిలోని పెన్నా నది తీర ప్రాంత ప్రజలు ఈ రెండు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.జగన్ మోహన్ రాజు ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులు ముందుగానే సమకూర్చుకోవాలని, వాతావరణ శాఖ సూచనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు.ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకుఈ సందర్భంగా టక్కోలు గ్రామంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , సర్పంచ్ లక్ష్మి దేవి, వార్డు మెంబర్ ఓబుల్ రెడ్డి, VRO రజని మేడం, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి లతో కలిసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. విపత్తు సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని , అవసరమైతే అధికారుల సహాయాన్ని పొందాలని సూచించారు.నాగముని రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పెన్నా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి జాగ్రత్త లు తెలియజేయాలి” అని అన్నారు.

2,809 Views

You may also like

Leave a Comment