మెంతా తుఫాను పట్ల ముంపు వాసులు జాగ్రత్త వహించండి. MRO
దామోదర్ రెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 26
ఒంటిమిట్ట: దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత చిన్న కొత్తపల్లి సమీపంలోని గంగల చెరువు నిండి అలుగు పొల్లడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఒంటిమిట్ట తాసిల్దార్ దామోదర్ రెడ్డి. కయా కర్పూరాలు అందించారు. ఎండాకాలంలో ఎండిపోయిన చెరువు ఇప్పుడు పొంగిపొర్లడంతో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. చెరువు నిండిడంతో ప్రజలు గంగమ్మకు కాయ, కర్పూరం, టెంకాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తాసిల్దార్ దామోదర్ రెడ్డి, ఆర్.ఐ. భాస్కర్ రెడ్డి, గంగల చెరువు నీటి సంఘం చైర్మన్ కట్ట వెంకటరమణ, బొబ్బిలి రాయుడు, విఆర్ఓ నికిత, సుబ్బయ్య , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులు చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి, నీటి మట్టం, ఎగువ ప్రాంతాల ప్రవాహం, చెరువు భద్రతా పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ,
“దాదాపు నాలుగేళ్ల తర్వాత చెరువు నిండడం పట్ల గ్రామ ప్రజల సంతోషం సహజమే. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ చెరువు మళ్లీ జీవం పొందింది. ఇబ్రహీంపేట, చిన్న కొత్తపల్లి, గంగ పేరూరు, రాజుగుడిపల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ చెరువు ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంతా’ తుఫాను ప్రభావం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పంటలను రక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సూచించారు.
నీటి సంఘం చైర్మన్ కట్ట వెంకటరమణ మాట్లాడుతూ, గంగల చెరువు నిండడం వల్ల రైతులకు పంట నీటి అవసరాలు తీరుతాయని, భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. గ్రామ పెద్దలు కూడా గంగమ్మ పూజల్లో పాల్గొని చెరువులోని నీటిని ఆశీర్వాదంగా స్వీకరించారు. చెరువు నిండిపోవడంతో రైతుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వు మెరిసింది. పంటలతో పల్లెప్రాంతం మళ్లీ పచ్చగా మారే రోజులు వస్తాయన్న నమ్మకంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
