

– రవితేజ ఫ్యాన్స్ కి ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
– ఒకరోజు ఆలస్యంగా మాస్ జాతర..?
– ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్
– ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆ స్టార్ హీరో
మాస్ మహారాజా రవితేజ (రవితేజ) ఫ్యాన్స్ నిరాశచెందేలా ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అంతలోనే వారిని హ్యాపీ చేసేలా ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం. (సామూహిక జాతర)
2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత హిట్ కోసం మాస్ మహారాజా రవితేజ.. ఈ వారం ‘మాస్ జాతర’తో తన అదృష్టాన్ని పరీక్షించనున్నారు. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్ 31న ‘బాహుబలి’ రీ-రిలీజ్ అవుతుండటంతో.. ఒకరోజు ఆలస్యంగా వచ్చే అవకాశముంది. ఇది చాలదు అన్నట్టు.. అక్టోబర్ 27న తలపెట్టిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారిలో ఉత్సాహాన్ని నింపేలా.. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: మరోసారి వాయిదా పడిన మాస్ జాతర!
‘మాస్ జాతర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పటికీ.. ట్రైలర్ విడుదలలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం సాయంత్రం ట్రైలర్ విడుదలవుతోంది. అంతేకాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బదులుగా.. అక్టోబర్ 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేసారు. ఈ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ సూర్య హాజరుకాబోతున్నారు.
సూర్య తన 46వ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సూర్య.. అదే బ్యానర్ నుండి వస్తున్న మరో సినిమా ‘మాస్ జాతర’ ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు అన్నమాట.