
– ప్రేక్షకులు థియేటర్ బయటికి పరుగులు తీశారు
– సినిమా చూసి కొందరు చనిపోయారు
– కొందరికి మతి చలించింది
యాక్షన్ సినిమాలు థ్రిల్ అవుతూ చూస్తారు. కామెడీ సినిమాలు పగలబడి నవ్వుతూ చూస్తారు. సెంటిమెంట్ సినిమాలు ఎమోషనల్ అవుతూ చూస్తారు. ఇక హారర్ సినిమాల విషయానికి వస్తే.. ఒక పక్క సినిమా చూస్తున్నంత సేపూ భయం వేస్తున్నా.. అలా భయపడుతూనే చూస్తారు.
హారర్ జోనర్ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. దానికి ట్రెండ్‌తో సంబంధం లేదు. ప్రేక్షకులని నిజంగా భయపెట్టే సినిమా ఎప్పుడైనా ఆదరిస్తారు. దానికి ఉదాహరణగా కొన్ని హాలీవుడ్ సినిమాలను చెప్పుకోవచ్చు. హారర్ సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకునే ‘ది ఎక్సార్సిస్ట్’ అనే సినిమా 1973లో విడుదలైంది. 12 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా 441 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఎన్నో హారర్ సినిమాలు వచ్చి విజయం సాధించాయి. వాటిలో ‘ది ఈవిల్ డెడ్’ అనే సినిమాను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హాలీవుడ్‌లో 1983లో విడుదలైన ఈ సినిమా 3 లక్షల 75 వేల వేల కోట్లతో నిర్మించారు. 29 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.
హైదరాబాద్‌లోని ఓ వీడియో పార్లర్‌లో సంవత్సరం పాటు ప్రదర్శించారంటే ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. అలా.. ది హెనన్, పోల్టర్‌గీస్ట్ వంటి సినిమాలు కూడా భారీ విజయాలు అందుకున్నాయి. 2013లో వచ్చిన ‘ది కంజరింగ్’ చిత్రం మరో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకి సంబంధించి వచ్చిన నాలుగు భాగాలూ సూపర్‌హిట్ అయ్యాయి.
ఈ సినిమాలన్నీ మూల బిందువుగా చెప్పుకునే ‘ది ఎక్సార్సిస్ట్’ చిత్రం ఒక ప్రత్యేకత ఉంది. 52 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా చూసి కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి మతిభ్రమించింది. కొందరు థియేటర్‌లోనే వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు భయంతో థియేటర్ బయటికి పరుగులు తీశారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది పిల్లలు చూడదగ్గ సినిమా కా రెంట్‌కి మాత్రమే లభిస్తుంది.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి హారర్ మూవీ ఇదే. ఈ సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు లభించింది. ఈ చాలా దేశాల్లో నిషేధించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమాగా ‘ది ఎక్సార్సిస్ట్’ నిలిచింది. సినిమాలో చాలా సీన్స్ ప్రేక్షకులకు వణుకు పుట్టిస్తాయి. ఈ సినిమా తర్వాత ఈ స్థాయిలో సినిమా చెయ్యాలని ఎంతో మంది దర్శకులు ప్రయత్నించారు. విజయం సాధించారు. కాకపోతే ఆ సినిమా స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు.