Home ఎంటర్‌టెయిన్మెంట్ కాంతార చాప్టర్ 1 ఇక్కడ రికార్డు.. అక్కడ లాస్ – VRM MEDIA

కాంతార చాప్టర్ 1 ఇక్కడ రికార్డు.. అక్కడ లాస్ – VRM MEDIA

by VRM Media
0 comments
కాంతార చాప్టర్ 1 ఇక్కడ రికార్డు.. అక్కడ లాస్



– కాంతార చాప్టర్ 1 కి ఆ ఏరియాలో నష్టాలు
– కాంతార ఓటిటి డేట్ ఇదే
– కాంతార రికార్డు కలెక్షన్స్

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఒక మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా కూడా ఇప్పటి వరకు 850 కోట్ల గ్రాస్ ని మించి. పైగా థియేటర్లలోకి అడుగుపెట్టిన నాలుగు వారాలకే ఆ స్థాయి కలెక్షన్స్. దీన్ని బట్టి ఈ మూవీకి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో లభించిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి లాభాలు ఎంతగానో వచ్చి ఉంటాయి కదా! కానీ లాస్ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా! నమ్మడం అటుంచి ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో ట్రోల్స్ వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు.

కానీ ఎవరు నమ్మశక్యం కానీ సూపర్ హిట్ మూవీ తన డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ ని అందించింది. ఆ చిత్రం కాంతార అధ్యాయం 1(కాంతార అధ్యాయం 1). అవును ఇది నిజం. పాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ ల సునామీని సృష్టించిన చాప్టర్ 1 మిలియన్ ఓవర్సీస్‌లో 5ల దగ్గర ఆగిపోయింది. రికార్డు ధరకి ఓవర్సీస్ హక్కులను డ్రీమ్స్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్, 4 సీజన్స్ క్రి యేషన్స్ తో కలిసి మరో రెండు సంస్థల హక్కులను పొందడం జరిగింది. నార్త్ అమెరికాలో 7 మిలియన్ డాలర్లకి పైగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ 5 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది. ప్రీమియర్స్ కి ఆశించిన స్పందన లేకపోవడంతో పాటు తొలి వీకెండ్‌లో కూడా నామమాత్రపు వసూళ్లే వచ్చాయి. అదే చాప్టర్ 1 కి ఓవర్ సీస్ లో మైనస్ గా నిలిచింది. మరి ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాన కొత్త కలెక్షన్స్ పరంగా ఏమైనా మార్పు వస్తుందేమో.

Also Read :సల్మాన్ ఖాన్ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!..పాన్ ఇండియా ప్రాజెక్ట్ పవన్ వద్దకు

ఇక కాంతార చాప్టర్ 1బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న తన దూకుడికి వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడం ఖాయమని అందరు భావించారు. కానీ ఈ నెల 31 న ప్రైమ్ వీడియో వేదికగా ఓటిటి ద్వారా జారీ చేయబడింది. దీంతో 850 కోట్ల దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే ఓవరాల్‌గా 2025 వ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇండియన్ హయెస్ట్ గ్రాసర్‌ ని సాధించిన మూవీగా నిలిచింది. ఈ రికార్డు ఈ ఇయర్ కాంతార చాప్టర్ 1 పేరుపైనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏది కూడా సిల్వర్ స్క్రీన్ పై ఈ రెండు నెలల్లో విడుదల కావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ‘ఛావా’ 807 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన 13వ చిత్రంగా కూడా కాంతార చాప్టర్ 1 రికార్డు సృష్టించింది.

2,804 Views

You may also like

Leave a Comment