Home వార్తలుఖమ్మం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర్ గ్రామంలో IKP మల్లిక ఏరియా లెవెల్ ఫెడరేషన్ గ్రామ సమాఖ్య ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా ధాన్యమును పండించి, తమ ఆరోగ్యాలని కాపాడుకోవాలని, క్రిమిసంహారక మందుల ద్వారా క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి , కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, పెద్ద బోయిన నరసింహారావు, కృష్ణం శెట్టి కొండలరావు, ఆలయ కమిటీ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్, మాడిశెట్టి శ్రీను, బందెల రాధాకృష్ణ, బుర్రి వీరయ్య, రంగు లక్ష్మణరావు, MRO,APM,CC,కల్లూరు గ్రామ సమైక్యలు బుక్ కీపర్ పి రామలక్ష్మి, త్రివేణి శ్రీలక్ష్మి స్వాతి రమ రజిని కృష్ణవేణి, మరియు రైతులు పాల్గొన్నారు..

2,811 Views

You may also like

Leave a Comment