Home ఎంటర్‌టెయిన్మెంట్ బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ! – VRM MEDIA

బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ! – VRM MEDIA

by VRM Media
0 comments
బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!



– మూవీ లవర్స్ లో జోష్
– థియేటర్లలో పండుగ వాతావరణం
– బాహుబలి ఎపిక్, మాస్ జాతర కి షాక్
– ‘మొంథా’ తుఫాన్ ప్రభావం ఉంటుందా!

దసరా, దీపావళి లాంటి పండగలు అయిపోయినా మూవీ లవర్స్ అందరు మరో రెండు పండుగల కోసం ఉన్నారు. ఆ రెండు పండుగల పేర్లే బాహుబలి ఎపిక్(Baaahubali Epic), మాస్ జాతర(Mass Jathara). ప్రభాస్(ప్రభాస్),రాజమౌళి(రాజమౌళి)ల బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 కలిపి మూడుగంటల నలభై నిమిషాలతో ఈ నెల 31న రీ రిలీజ్ అవుతుండటం, రవితేజ మరోసారి తన మార్క్ అంశాలతో నవంబర్ 1న మాస్ జాతరతో వాస్తవ సినీ ప్రేమికులు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు.

కానీ ఇప్పుడు ఈ రెండు చిత్రాలకి ‘మొంథా'(Montha)తుఫాన్ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొంథా తఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. సెలవలు కూడా ప్రకటించడంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే బయటకి రావద్దని ప్రభుత్వం కూడా వెల్లడి చేసింది. పైగా ఈ రోజు అర్ధరాత్రి ‘మొంథా’ కాకినాడ సముద్రం వద్ద తీరం దాటనుంది. దీంతో ఇది వాయుగుండంగా మారి ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసాయి. తెలంగాణలో కూడా ఈ ప్రభావంతో చాలా ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఎందుకు ఈ బెదిరింపులు! మనమంతా ఒకటేగా

ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 31 , నవంబర్ 1 విడుదల అవుతున్నాయి కాబట్టి అప్పటికి వర్షం తగ్గుతుందని అనుకున్నా, వాతావరణ శాఖ ఖచ్చితమైన హామీని ఇవ్వడం లేదు. వాయుగుండం రోజుకి ఒక రకంగా తన గమనాన్ని మార్చుకుంటుంది. మరి రిలీజ్ కి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఒక వేళ మూవీ లవర్స్ తపస్సు ఫలించి వర్షాలు తగ్గాయే అనుకుందాం. కానీ వర్షాల నుంచి అప్పుడే తెరపైకి వచ్చిన ప్రేక్షకులు థియేటర్స్ కి ఎంత వరకు వెళ్తారో అనే డౌట్ ని సోషల్ మీడియా వేదికగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా ఒక సినిమాని మరో సినిమా దెబ్బ కొడుతుంది. ఈ లెక్కన ‘మొంథా’ ని కూడా ఒక సినిమాగా బావించవచ్చనే కామెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

2,804 Views

You may also like

Leave a Comment