

– ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
– హీరోలు, నిర్మాతలు ఏం చేస్తారు
– సినీ ఫెడరేషన్ కి రేవంత్ రెడ్డి గిఫ్ట్
ఇప్పుడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్. ఈ పాన్ ఇండియాట్రెండ్ లో ముందు వరుసలో ఉంది మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ. దీనికి కారణం మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడమే. మరి ఈ లెక్కన నిర్మాత ఎంత ఖర్చు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే ఈ నిర్మాతలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నారు.
రీసెంట్ గా హైదరాబాద్ లో తెలుగు సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ మీటింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడితే సినిమా టికెట్ రేట్లు పెంచితే నిర్మాతలకు, హీరోలకి ఆదాయం వస్తుంది. కానీ కార్మికులకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి టికెట్ రేట్లు పెంచితే వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. ఈ మేరకు జివో కావాలని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది.
ఇది కూడా చదవండి: బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!