
– మానవీయ విలువలకు పట్టం కట్టిన ‘ఇడ్లీ కొట్టు’
– సూపర్ హీరోయిన్ విన్యాసాలతో ‘లోక చాప్టర్1’
– ప్రేక్షకులని ఆధ్యాత్మికత వైపు నడిపించిన ‘కాంతారా చాప్టర్1’
ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సాధన సినిమా ప్రధానంగా నిలుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేవి. ఆరోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మరో వేదిక లేదు కాబట్టి థియేటర్లనే ఆశ్రయించేవారు.
కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. వివిధ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఎవరికి నచ్చిన సినిమాను వారు చూడగలుగుతున్నారు. కొన్ని థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరు అదే సినిమా కోసం ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇటీవలి కాలంలో థియేటర్లకు గట్టి పోటీనిస్తూ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు రావడంతో ఓటీటీ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read: నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీల కొత్త నిర్వాకం!
ఎంత పెద్ద సినిమా అయినా ఏదో ఓటీటీ సంస్థ ద్వారా స్ట్రీమింగ్ కావాల్సిందే. దాంతో సినిమా రిలీజ్ అయిన నెలరోజుల గ్యాప్‌లో ఓటీటీల్లోకి వస్తోంది. అలా ఈవారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులకు వినోదాల విందు చేయబోతున్నాయి. ఆ సినిమాల వివరాలేమిటో ఒకసారి చూద్దాం.
తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే హీరోల్లో ధనుష్ ఒకరు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకు ఇటీవల ‘ఇడ్లీకొట్టు’ చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు ధనుష్. జీవితంలో మనం ఏ పని చేసినా కేవలం ఆదాయం కాకుండా ఆస్వాదించండి అనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ సినిమా తమిళ్‌లో రూపొందించబడింది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో మానవీయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఈ సినిమా థియేటర్‌లో చూసిన ప్రేక్షకులకు ఏమైందో తెలుసా?
ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి చక్కని అనుభూతిని కలిగించిన మరో సినిమా ‘లోక చాప్టర్ 1’. మలయాళంలో రూపొందించిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్‌లో ఉన్న చంద్ర పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ లేడీ ఓరియంటెండ్ మూవీ అక్టోబర్ 31 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇది కూడా చదవండి: ట్రైలర్‌తో అల్లాడించిన రవితేజ.. ‘మాస్ జాతర’కు మాస్ మహారాజ్ రెడీ!
ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన సినిమా ‘కాంతార చాప్టర్1’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆధ్యాత్మికత వైపు నడిపించింది. ఈ సినిమాలో రిషబ్ పెర్ఫార్మెన్స్, సంగీతం ప్రేక్షకులు మైమరచిపోయి సినిమా చూసేలా చేశాయి. ఈ సినిమా అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఇలా.. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఇంటిలోకి వచ్చేశాయి. ఇంటిల్లి పాదీ ఈ సినిమాలను చూసి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు.