Home ఎంటర్‌టెయిన్మెంట్ బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన! – VRM MEDIA

బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన! – VRM MEDIA

by VRM Media
0 comments
బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన!



బాహుబలి-3 పై రాజమౌళి క్లారిటీ
రంగంలోకి కొత్త దర్శకుడు
120 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్

బాహుబలి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒక సినిమా అక్టోబర్ 31న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి ‘బాహుబలి-3’ అనౌన్స్ మెంట్ వీడియోతో సర్ ప్రైజ్ చేయబోతున్నారంటూ తెగ చర్చ. తాజాగా రాజమౌళి కీలక ప్రకటన చేశారు. (బాహుబలి ది ఎపిక్)

‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ప్రభాస్, రానాతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూలో ‘బాహుబలి-3’ గురించి వస్తున్న వార్తలపై రాజమౌళి స్పందించారు. (ఎస్ఎస్ రాజమౌళి)

“బాహుబలి: ది ఎపిక్ ఇంటర్వెల్ లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ ను ప్రదర్శించబోతున్నాం. అయితే ఇది ‘బాహుబలి-3’ అని, అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నామని కొందరు అనుకుంటున్నారు. కానీ, ఇది ‘బాహుబలి-3’ కాదు. ఇదొక యానిమేషన్ ఫిల్మ్. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది రెండు మూడేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పై వారు వర్క్ చేస్తున్నారు.” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: తమన్నా ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

2,806 Views

You may also like

Leave a Comment