ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 29:–
వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, జలగణిత దంపతుల కుమార్తె శివ చక్రవేణి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ తన కుమార్తె శివ చక్రవేణి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వృద్ధులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని,అన్నం పరబ్రహ్మ స్వరూపమని పదిమందికి అన్నదానం చేయడంలో ఉన్నంత సంతోషం దేనిలోనే ఉండదని,అన్నదానం చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పెండ్యాల రాజు,సారా శ్రీను,శివ,బాబి తదితరులు పాల్గొన్నారు.