కల్లూరు డివిజన్ పరిధిలోని చెరువులు కుంటలు పరిశీలించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ద్విచక్ర వాహనంపై చెరువు కట్టలు మరియు కుంటలను పరిశీలించారు అలానే పెనుబల్లి మండల పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించి, ప్రాజెక్ట్ ప్రాంగణంలో సమగ్ర ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోని వరద పరిస్థితులు, నీటి నిల్వ స్థాయిలు, ప్రవాహ నియంత్రణ వ్యవస్థలు, అలాగే భవిష్యత్తులో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను విపులంగా పరిశీలించారు.