Home ఎంటర్‌టెయిన్మెంట్ మెగా హీరోలని విజయ్ దేవరకొండ ఢీ కొట్టబోతున్నాడా! అభిమానులు ఏమంటున్నారు – VRM MEDIA

మెగా హీరోలని విజయ్ దేవరకొండ ఢీ కొట్టబోతున్నాడా! అభిమానులు ఏమంటున్నారు – VRM MEDIA

by VRM Media
0 comments
మెగా హీరోలని విజయ్ దేవరకొండ ఢీ కొట్టబోతున్నాడా! అభిమానులు ఏమంటున్నారు



– మెగా హీరోలతో విజయ్ దేవరకొండ ఢీ
– రౌడీ జనార్దన్ రిలీజ్ డేట్
– రవికిరణ్ కోలా మూవీ కథ ఏంటి?
– మహారాష్ట్ర లో షూటింగ్

సినిమా విజయాన్నిబట్టి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బట్టి ఒక హీరో రేంజ్ పెరుగుతుంటుంది. దీనితో హీరో తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇది ఒక హీరో ఇమేజ్ కి సంబంధించి రెగ్యులర్ గా జరిగే ఫార్మేట్. కానీ సరైన హిట్ పడి చాలా కాలం అవుతున్నా కొంత మంది హీరోల క్రేజ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి ఒక హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే ఇందుకు నిదర్శనం. తెలుగు సినిమా రంగానికి దొరికిన మరో అద్భుతమైన హీరో అని కూడా చెప్పుకోవచ్చు.

రవికిరణ్ కోల(రవికిరణ్ కోల)దర్శకత్వంలో విజయ్ కొత్త చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. కీర్తిసురేష్(కీర్తి సురేష్)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు(దిల్ రాజు)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఒక తీర ప్రాంతంలో జరుగుతుంది. యాక్షన్, రొమాన్స్, గ్రామీణ రాజకీయాల మేళవింపుతో కూడిన పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కుతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ‘రౌడీ జనార్దన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డేట్ ని ఇంకా అధికారకంగా ప్రకటించకపోయినా, సమ్మర్ కి రావడం ఖాయమని సమాచారం.

మరి సమ్మర్ కే చిరంజీవి(చిరంజీవి) నుంచి విశ్వంభర, పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు వస్తున్నాయి. రామ్ చరణ్(Ram Charan)మార్చి 27 న ‘పెద్ది’ తో వస్తున్నాడు. అందుకే చిరు, పవన్ లు తమ ఏప్రిల్ మధ్య తారీకుల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి అదే జరిగితే ఆ ఫీవర్ నెల మొత్తం ఉంటుంది.

ఇది కూడా చదవండి: డ్యూడ్ ఓటిటి డేట్ ఇదేనా! వాళ్ళకి మాత్రం షాక్

ఈ నేపథ్యంలో రౌడీ జనార్దన్(Rowdy Janardhan)సమ్మర్ కి వస్తే ఎప్పుడు వస్తుంది! మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. దీంతో చాలా మంది హీరోలు, మేకర్స్ తమ ఏప్రిల్ మిడిల్ నుంచి రిలీజ్ చేస్తారు కదా! మరి అదే జరిగితే రౌడీ జనార్దన్ విజయ్ మెగా హీరోలతో పోటీపడే అవసరం ఏర్పడుతుందా అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం.ప్రస్తుతం చాలా చిత్రాలు అనుకున్న డేట్ కి రాకుండా ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పైకి క్యూ కడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పెద్ద సినిమాలు వారం వారం గ్యాప్ లో వచ్చినా ఇంకో సినిమాకి నష్టమే. విజయ్ కి అయితే మెగా హీరోల అందరితో మంచి బ్యాండింగ్ ఉంది.

2,804 Views

You may also like

Leave a Comment